నాలో ఏదో తెలియని ఆవేశం ..
ఏదో తెలియని అసహనం , గత కొన్ని రోజులుగా నన్ను తరుముతూనే ఉంది .
జీవితంలో ఏదో సాదించాలనే తపన కాబోలు
నలుగురిలోనూ గౌరవించ బడాలని
నలుగురు మెచ్చే పని చేయాలని
గాలిలో స్వేఛ్చ కావాలని
ఓ తపన రగిలి పోతూనే ఉంది
ఎవరితో చెప్పుకోను .. ఎమన్నా చెప్పాలన్న ఏమని చెప్పను ..
సరిగ్గా నాకు కావలసిన ఇది .. అని నాకు తెలిస్తే ఏమైనా చెప్పోచేమో . .
(అయిన ఇది కావాలి అని అనుకుంటే ఇంకా చెప్పుకునేది ఏముంది ??)
ఆకాశం వైపు చూసి ఒక్కటే అడగాలి ..
అసలేం జరుగుతుంది ఇక్కడ. .......... నాకు తెలియాలి !!!!