రమణ ఓ రోజు పని పాటా ఏమి లేక పోవడం తో (కేవలం ఆ ఒక్క రోజే పని లేదు అనుకున్నారంటే మీరు పప్పు లో కాలేసారు ).. ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ అలా ప్రసాద్ రూం కి వెళ్ళాడు. రూం లోకి వెళ్ళగానే .. బోరింగ్ మెషిన్ శబ్దం వినిపించి కొంచం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు .. ఏమిట్రా అని చూడబోతే ప్రసాద్ నిద్రలో ఉన్నాడు. (విషయం ఏమిటంటే ప్రసాద్ కి గురక ముందు వచ్చి తరువాతే నిద్ర పడుతుంది .. ..)
ఇహ చేసేదేమీ లేక ప్రసాద్ ఫోన్ తో సరదాగా ఆట మొదలెట్టాడు రమణ . ఏమయ్యిందో కాని ఈ పని లేని మంగలోడి బుర్ర లో ఓ వినుత్నమయిన idea తట్టింది . . (బహుశా .. బోరింగ్ మెషిన్ ప్రభావం అయ్యి ఉంటుంది! )
ప్రసాద్ ఫోన్ నుంచి బన్నీ అనే పేరు ని .. 'hutch' గా మార్చాడు ..వెళ్లి బన్నీ ఫోన్ ని 'చిన్న పని ఉంది రా' అని తీసుకుని , ఓ మెసేజ్ ఇలా పంపాడు (ప్రసాద్ కి )..
"మీ నంబరు కి Rs. 200 రీచార్జ్ చెయ్యబడింది .. దయచేసి 'hutch' డీలర్కు Rs.200 చెల్లించగలరు. "
ప్రసాద్ రూం కి వెళ్లి .. (అతి కష్టం మీద ) నిద్ర లేపి .. "ఒరేయ్ .. నేను పొరపాటున నీ నంబరు కి .. రీచార్జ్ చేయించాను .. నీ దానిలో డబ్బు పడి ఉంటుంది .. ...కావాలంటే నీకు వచ్చిన మెస్సేజి చూడు .. నా రెండు వందలు ఏవో నాకు ఇచేయి రా! " అన్నాడు ..
ప్రసాద్ మెసేజ్ చూశాడు .. చూస్తే "hutch" నుంచి మెసేజ్ వచ్చినట్టు ఉంది .. (అది బన్ని ఫోన్ నుంచి పంపిన మెసేజ్)
చిన్న నవ్వు నవ్వి .. రమణ వైపు కొంటె చూపులు చూస్తూ ..
"అంతా బానే చేసావ్ రా ... కాని అస్సలు విషయం మరిచావు .. " అన్నాడు ప్రసాద్ ..
..
..
రమణ "అవును నా రెండు వందలే కదా .. ఇచ్చేయి .. " అన్నాడు , మనసులో ఏదో మూల వీడికి తెలిసిపోయింది అనే సందేహం ఉన్న కూడా..
ప్రసాద్ ఇహ నవ్వడం మొదలెట్టాడు .. (వెధవది గురక ఎంత చెండాలంగా ఉన్న .. నవ్వు బానే ఏడుస్తుంది లెండి. )
"ఏం మర్చిపోయవో ఇప్పటికయినా తెలిసిందా .. ??" అని అడిగాడు ..ప్రసాద్..
ప్రసాద్ గాడి 'confidence' చూసి .. ఇహ తప్పక "మావా నువ్వు కేక రా .. నువ్వు పొలికేక .. ఏం మరిచాను రా .. అంతా పగడ్బందీ గానే చేశా కదా .. .. " అని ఓటమి ఒప్పుకున్నాడు రమణ..
ప్రసాద్ ..
"నాది Airtel రా !!! " అన్నాడు ..
రమణ నిరుత్సాహ పడేలోపల మన కొంటె ప్రసాద్ ఈ బ్రహ్మాండమయిన idea వృధా అవ్వకూడదు అని నిశ్చయించుకుని .. రమణ ని తోడు దొంగ గా నియమించాడు ..
ఇంతకి ఎవరి మీద ప్రయోగించాలి అని అనుకోబోయే లోపలే .. ప్రసాద్ ఈ పనికి తగిన నెమ్మదస్తుడు , తెలివయిన వాడు , ఓపిక కలవాడు , తగిన " దుర " అదృష్టం ఉన్న వాడు .. "ఒక్కడున్నాడు " అని అన్నాడు . రమణకి చటుక్కున అర్ధం అయ్యింది. రమణ మనసులో "నీకు బోకుబిచ్చ అంటే తెలియదా ?" అనే శబ్దాలు echo అయ్యాయి. (అమ్మ తోడు ఇది బూతు కాదు . "బోకు బిచ్చ" గురించి మీకు త్వరలో తెలుస్తుంది )
రమణ , ప్రసాద్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని , ఒకే సారి గట్టిగా .. "మహేష్!!!!" అని నవుతూ అరిచారు .
మహేష్ ఫోన్ లో బన్నీ పేరు ని "Hutch" గా మార్చమని , ఏకంగా బన్నీ నే అడిగారు వీళ్ళు ఇద్దరు.
ఈ జీవితానికి ఇది చాలు అని అనుకుని బన్నీ మహేష్ ని కలవడానికి వెళ్ళాడు.
మహేష్ ఎటో బయల్దేరుతుంటే ..బన్నీ కలిసి 'నే కూడా వస్తా' అన్నాడు .
ఎవడో చిన్న బూకంపం వచ్చినట్టు తుమ్మాడు . మన బన్నీ ఏదో తమాషకి .. "ఇదేమి అపశకునం" అన్నాడు ..
మహేష్ దోరగా చూసి (వాడి చూపే అంత లెండి!! )..
కొంచం చిరాకు గా "ఇవన్నీ 21st century కి వర్తించవు రా . ఎప్పుడు బాగు పడతారు రా మీరు .." అన్నాడు ..
"అపశకునం నాకు కాదు " అన్నాడు బన్నీ సూచనప్రాయంగా !!
మహేష్ బన్నీ వైపు "సిల్లీ ఫెలో లేక పోతే నాకా!!" అన్నట్టు ఓ "లుక్" పడేశాడు ..
ఈ లోపు మన బన్నీ మహేష్ చేతిలో ఫోన్ తీసుకుని ఎంతో చాకచక్యంగా తన పేరుని "Hutch" గా మార్చి , ఈ తిరుగులేని కధ లో తన పాత్రను సరిగ్గా పోషించాను అన్న ఆనందంతో రెండు ఆనంద భాష్పాలు రాల్చాడు.
బన్నీ ఫోన్ ప్రసాద్ దగ్గర ఉండడం తో , సరియిన సమయానికి ప్రసాద్ మెసేజ్ కూడా పంపాడు ..
ఆ పాడు మెసేజ్ రానే వచ్చింది. బన్నీ మహేష్ కి ఫోన్ ఇచ్చి , "మెసేజ్ కాబోలు" అన్నాడు ఏదో తెలియనట్టే ..
ఒకడికి పోయేకాలం ఎంత వేగంగా రాగలదో రమణ అంత ఆవేశంగా పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇద్దరి దగ్గరకి వచ్చాడు ..
మహేష్ ని చూసి "నీకు
.
.
(wait for it)
.
.
మెసేజ్ ఏమయినా వచ్చిందా ??" అని అడిగాడు ..