"రేఖ ఆంటీ ఇంటికి వెళ్ళాలి, నాకు తోడు  రారా , ఎలాగో ఖాళి ఏ కదా !!!"అని మా అమ్మ అంది. మాములుగా అయితే నేను  అమ్మ కి తోడుగా ఆ ఆంటీ  ఈ ఆంటీ ఇళ్ళకి వెళ్ళను. నాకు బహు చిరాకు. కాని, అమ్మ పిలిచింది రేఖ ఆంటీ ఇంటికి. రేఖ ఆంటీ కి ఒక కొడుకు (అంతగా  అవసరం ఉన్న విషయం కాదు లెండి) , ఒక కూతురు!!!!. కూతురి పేరు స్వాతి. స్వాతి అంటే నాకు ఎంతో ప్రీతీ. మనం అందుకే అమ్మ ఎప్పుడు పిలిచినా , రేఖ ఆంటీ ఇంటికి మిస్ అవ్వకుండా వెళ్తుంటాం.
ఒకప్పుడైతే మా  కాలనీ లో ఉండే వాళ్ళు  కాబట్టి వాళ్ళ ఇంటికి  వెళ్ళడం పెద్ద ఇబ్బంది కాదు. కాని వాళ్ళు ఇప్పుడు ఊరి  అవతల కి వెళ్లి ఇల్లు కట్టుకున్నారు. అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు వెళ్ళాలంటే, రెండు బస్సులు మారి, అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని వెళ్ళాలి. కాని చాలా రోజుల తరువాత స్వాతి ని కలుస్తున్నాను అన్న ఆనందం లో .. ఈ విషయాన్నీ పెద్దగ లక్ష్య పెట్టాలా. నేను అద్దం ముందు పడ్డాను. 
అమ్మ "ఒరేయ్, నువ్వు వస్తావా నన్ను ఒక్కదానినే వెల్లమంటావా " అంది.
నేను నా అలంకారం అక్కడితో ముగించి, బస్సు స్టాప్ కి వెల్లా . అది  అసలే  ఎండా కాలం. ఎండలు మండి పోతున్నాయి . నేను బస్సు ఎక్కి , అలా  ఓ గంట సేపు కలల్లో తెలుతున్నా. స్వాతి ని కలిసి నప్పుడు ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తూ గడిపా. ఎండా పెరిగింది. నా  అసహనం   కూడా .  ఎంత సేపటికి, గమ్యం రాదే.
నానా యాతనా పడి , చేరుకున్నాం వాళ్ళ ఇంటికి. అమ్మ  రేఖ ఆంటీ కోసం వెతుకుంటూ వాళ్ళ ఇంటి లోపలి వెళ్ళింది. బయట ఒకటే సందడి. అన్నట్టూ, రేఖ ఆంటీ కొడుక్కి ఒడుగు(ఇది కూడా అంత ఉపయోగ కరమయిన విషయం కాదు లెండి).
నేను కూడా చిన్నగా అమ్మ వెంట చంటి పిల్లోడి లాగా  వెళ్ళాను. పైన  చూస్తే స్వాతి . ఆహా , ఓహో , అంటూ  మనసులో కుప్పి గెంతులు వేసుకున్నా. సరిగ్గా చూస్తే ,  స్వాతి చంకన ఎవడో బుడ్డోడు ఉన్నాడు.
గుండెలో కలుక్కు మంది. సందేహం తో ఎవడు ఆ బాబు, అని అడిగే లోపలే, మా అమ్మ స్వాతి ని పలకరించింది. క్షేమ కబుర్లు అయిన తరువాత ,  స్వాతి  "ఆంటీ , ఈయనే మా ఆయన " అంది ఎవరో పెద్దమనిషిని చూపిస్తూ .
గుండె ఎందుకో ఒకే సారిగా బరువెక్కింది. ఆ దెబ్బకి నా నోట మాట పడిపోయింది. స్వాతి  నివ్వెరపోయిన నన్ను చూసి, తనే పలకరించింది.  కొద్ది సేపు ఏం మాట్లాడిందో కాని, నాకు ఏమి తెలియలా.  అక్కడ నుంచి ఎంత తొందరగా వెళితే అంత మంచిదని మాత్రం అనిపించింది. మా  అమ్మని  కొంచం  హడావుడి  పెడుతుంటే  " కంగారు  ఏముంది  రా , నీకేమయిన  పనా  పాటా!!" అంది. అసలే గుండె బరువు తో ఉన్నవాడిని, ఇప్పుడు చెవ్వులో కూడా ఏదో మంటగా ఉంది.
ఇల్లు చేరాక , ఓ రెండు రోజులు ఎవ్వరితో మాట్లాడలా. నన్ను, నా వాలకాన్ని చూసి, పిచ్చి తండ్రికి ఒంట్లో బాలేదేమో అని అనుకుని, మా అమ్మ లైట్ తీసుకుంది.
సంధ్య ని కలిసిన తరువాత నేను కూడా ఈ విషయం లైట్ తీసుకున్నా. తప్పదు కదా మరి!!
 
No comments:
Post a Comment