Showing posts with label despo. Show all posts
Showing posts with label despo. Show all posts

Monday, August 30, 2010

'ఎందుకిలా' నా ఖర్మ కాలిపోయింది ?

ఈ కధని అందించిన సుసు బాబు కి , సత్తి బాబుకి నా ధన్యవాదాలు. కధ లో .. 'నేను' మా సత్తి .
----------------------------

హరిగాడు ,నేనూ అప్పుడే రూంలోకి వెళ్లి , రిలాక్ష్ అవుతున్నాం. మా లంబుగాడు రూంకి వచ్చి, "నేను కొత్త నెంబర్ తీసుకున్నా!!! మీ ఫోన్ లో ఫీడ్ చేసుకోండి" అన్నాడు . వెంకటేష్ ప్రసాద్ సెంచరి, సహారాలో వరదలు, ఇలాంటి 'అవకాశాలు' చాలా అరుదుగా వస్తాయి. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మాయి లా మాట్లాడి ఎవరినన్నా 'బక్రా' చేయొచ్చని అనుకున్నాం. దీనిలో హరిగాడు దిట్ట.
అయితే , తన పరపతిని తిరుపతిలో చాటి చెప్పుకోవడానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు, మా హుస్సేన్ భాయి .
"హుస్సేన్ భాయి తిరుపతి నుంచి వస్తున్నాడురా..దారిలో ఉన్నాడు" అని అన్నాను హరిగాడితో .
"అయితే భాయికే ఫోన్ చేద్దాం ..సిందు అని చెబుదాం" అన్నాడు హరి.

అప్పుడో సారి సిందు అనే అమ్మాయి గురించి ఏవో నాలుగు ముక్కలు కక్కాడు మా హుస్సేన్ భాయి. సరిగా హరిగాడికే చెప్పకూడదని, పాపం భాయి మాత్రం కల కన్నాడా? ..

ఇంకేముంది, హరిగాడు వెంటనే హుస్సేన్ భాయికి ఫోన్ చేసి , స్పీకర్ ఆన్ చేశాడు.

హరిగాడు (అమ్మాయి గొంతులో )
" హలో .. "
హుస్సేన్ భాయి : " హలో ఎవరు ?"
"హలో , నేను హరి చిచి సిందుని మాట్లాడుతున్నా!!! "
" హలో ఎవరు ?? " (హుస్సేన్ భాయి కి సరిగ్గా వినపడాల్సిన విషయం వినపడలేదు పాపం.)
"హలో నేను సిందుని మాట్లాడుతున్నా !! "
హుస్సేన్ భాయికి అప్పుడే ఏదో తేడాగా ఉంది అని అనిపించింది.
" ఎవరు ?? సిందు నా ? "
" అవును , నేను సిందునే మాట్లాడుతున్నా. "
" నా నెంబర్ ఎలా తెలిసింది ? "
" మీ ఇంట్లో అడిగి తెలుసుకున్నా " (హరిగాడి సమయస్పూర్తి ఇది. సిందు పక్కింటిలోనే ఉంటుంది అని భాయి కక్కాడు.. అదే చెప్పాడు)
భాయికి నమ్మకం కలగక పోయినా , ఏదో మూల చిన్న ఆనందం వేసింది.
" సరే .. మరి .. మరీ .. మరీ .. ఆప్ .. "
జీవితంలో అమ్మాయితో మాట్లాడి ఎరుగని భాయికి ఏకంగా ఒక అమ్మాయి ఫోన్ చేసింది అంటే ఈ మాత్రం మాటలు రావడం కూడా ఎక్కువే !!!
హరిగాడు .. 'హరిగత్తె' లా "ఎలా ఉన్నావ్ హుస్సేన్ ? "
" నేను బాగానే ఉన్నా .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
" నేను కూడా బాగానే ఉన్నా. మా ఫ్రెండ్స్ కొంత మంది బెంగుళూరుకి వచ్చారు. IIScని చూద్దాం అని అన్నారు. నాకు నువ్వు తప్ప అక్కడ ఎవరూ తెలియదు .. నాకు , మా ఫ్రెండ్స్ కి IISc చూపిస్తావా? "
" ఖచితంగా !!!" . కాని భాయి కి ఇంకా అనుమానం తీర లేదు. ఎవరికీ చెప్పని విషయం ఒకటి అడిగి చూదాం అని .. " ఇంతకీ బెంగుళూరు లో ఎక్కడ ఉంటున్నావ్ ?"
హరిగాడికి విషయం తెలియదు . సరే రాయి వేద్దాం అని "ఆం .. హుం .. ఆం .. మారత్ హళ్లి లో .. " అన్నాడు. మా అదృష్టవశాత్తు, భాయి 'దుర-అదృష్టవశాత్తు' అమ్మాయి మారత్ హళ్లి లోనే ఉంటుంది.
అనుమానం పూర్తిగా తీరిపోయిన భాయి ఇక మాంచి రొమాన్స్ మూడ్ లోకి వచ్చేసాడు.
" .. .. సరే సరే .. .." అని కొద్ది సేపు భాయి అలా పైకి చూస్తూ ఏదో ఆలోచించడం మొదలెట్టాడు.
ఓ పావు గంట తరువాత , ఏదో గుర్తుకు వచ్చినట్టు "ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ? " అన్నాడు.
ఇంతలో హరిగాడికి భాయి నమ్మేసాడు అన్న ఆనందంలో నవ్వు ఆగట్లేదు. ఫోన్ కట్ చేశాడు. వెంటనే మాలో కొందరం పంది మూక బురద కాలవలో దొర్లి నట్టు కింద పడి దొర్లి దొర్లి నవ్వడం మొదలెట్టాం. మిగతావాళ్ళు బల్లిలా గోడ కి అత్తుక్కు పోయి నవ్వుతున్నారు. నేల మీద ఉన్నవాళ్లు గోడ మీదకి , గోడ మీద ఉన్నవాళ్లు నేల మీదకి చిన్నగా నవ్వుతూ మారాము. లోపు హాస్టల్లో ఉన్న వాళ్ళు , మా భీకరమయిన శబ్దాలని విని, బందిపోటో , టెరరిస్టో వచ్చాడేమో అని అందరూ కంగారు కంగారుగా వచ్చారు. మా నవ్వులు చూసి, పాపం కోర్సు ఒత్తిడి తాళలేక ఇలా మతి తప్పి ఉండొచ్చులే అనుకుని ,వెళ్ళిపోయారు.
ఒక వేల మా నవ్వులు వినిపించి ఉంటాయేమో అని .. హరిగాడు అనుమానంగా మళ్ళి ఫోన్ చేశాడు ..
హుస్సేన్ భాయి: " చెప్పు సిందు "
హరిగాడు : (అనుమానం తీరింది ..) " హా .. మరి .. ఇంకేంటి ? "
"చెప్పాలి నువ్వే "
"(పూర్తి నిశబ్దం) .. ?? .. " (హరిగాడికి ఏమనాలో తెలియలా)
లోపు భాయి మనసులో చిన్న తీన్ మార్ వేసుకుంటున్నాడు. ఇన్ని రోజులుగా బెంగుళూరులో ఉంటూనే ఎప్పుడూ మాటా మంచి లేదు .. అనుకుంటూ ..అన్నింటి కంటే ముఖ్యంగా ఒక అమ్మాయి తనకి ఫోన్ చేసింది అన్న విషయాన్ని నమ్మలేక పోతూ " అవును .. సిందూ ..
..
..
All of a sudden ... ఎందుకిలా ?? " అన్నాడు భాయి.

ఇక వల్లకాక హరిగాడు .. మళ్ళి దొర్లడం మొదలెట్టాడు. ఫోన్ కట్ చేసేసాము.
------------------------------


మేము అందరం మెస్సు లో కూర్చుని ఉన్నాం. మా అందరిని చూస్తూ .. హుస్సేన్ భాయి .. కొంచం సిగ్గు పడుతూ , తన పళ్ళెం తీసుకుని వచ్చాడు. మేము ఏదో మాట్లాడటం మొదలెట్టాం. హుస్సేన్ భాయి మధ్యలో వచ్చి " పనిని అలా చెయ్యకూడదు రా .. " అన్నాడు.
నేను భాయి ని చూసి .. "అవును భాయి ..
.
.
All of a Sudden .. ఎందుకిలా?" అన్నాను
----------------------------------------------

Saturday, July 31, 2010

నా దేవదాసు కహానీలు - 2

అది చలి కాలం. పొద్దున్నే లేచి కాలేజి కి వెళ్ళాలంటే బద్ధకం . చిన్నగా బయల్దేరడం మొదలెట్టా.
ఇప్పటికే అమ్మాయిలు లేక ఎండిపోయిన నా జీవితం లో ఆ చలి కాలం పగుళ్ళు (పెదాలకి ) తప్పితే ఏమి తేలేదు.
బస్సు స్టాప్ కి బహు బద్ధకం గా చేరా. బస్సు కోసం ఎదురు చూసి చూసి చిరాకు మొదలయింది. అప్పుడే ఒక అందమయిన అమ్మాయి అలా ఆటో దిగి బయటకు వచ్చింది. తొలిప్రేమ లో పవన్ కళ్యాణ్ , కీర్తి రెడ్డి ని చూసినట్టు అలా చూస్తూ కాలం మర్చిపోయ.
మనసు లో ఏదో ఆనందం. ఓహ్ చిన్న భయం కూడా.

నేను ఆహ్ అమ్మాయి దగ్గరికి వెళ్లి , నీ పేరు సంధ్య కదా ?? అన్నాను .
ఆ అమ్మాయి ఆశ్చర్యం తో , నీకెలా తెలుసు అంది ?
( అందమయిన అమ్మాయి , పేరు తెలుసుకోవడం పెద్ద విషయమా ఏమిటి ? మా కాలేజి లో ఎంత మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ లో ఎంత బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఉన్నారో కూడా తెలిసే మనకి , ఇది అస్సలు లెక్కే కాదు. )
ఏదో మాటదాటేసా. నేను ఎంత సేపటినుంచో వెతుకుతున్నా బస్సు ఒక్కటి ఆగలేదు కాని, ఆ అమ్మాయి ఒక్క సారి అలా నాజూగ్గా చెయ్యి ఊపింది. ఎంతో వేగంగా వెళ్ళే బస్సు కాస్త , సడన్ బ్రేకు వేసి మరీ ఆగింది ( ఒక అందమైన అమ్మాయి చెయ్యలేనిది చాలా తక్కువ పనులు అని సంధ్య ని చూసిన తరువాతే తెలిసింది ).

ఇద్దరం బస్సు ఎక్కాం. పరిచయం బానే పెంచుకున్న , ఈ నెపంతో.
అంత బానే వెళ్తున్న టైం లో మా B.Tech 1st yr రిజల్ట్స్ వచ్చాయి. సంధ్య కనిపించి మార్కుల గురించి అడిగింది.
అనుకోని పరిస్థితుల్లో , ఏదో కర్రెక్షన్లో పొరపాటో ఏమో కాని , నేను మా కాలేజీ కి ఆ సంవత్సరం topper ని అయ్యాను. ఈ పొరపాటు మళ్ళి జరగలేదు సుమీ.
దాని తో సంధ్య వీడు మనలో ఒకడు కాదు అని ఫిక్స్ అయ్యిపోయింది. వీడితో స్నేహం ఎక్కడికి వెళ్ళదు అని డిసైడ్ అయ్యిపోయి, నన్ను పిచ్చ లైట్ తీసుకుంది.
topper అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనుకునే నాకు , దేవుడు చెప్పిన సమాధానం ఇదే ..

"కొన్ని కొన్ని సార్లు నష్టం కూడా !!!"

Wednesday, May 5, 2010

నా దేవదాసు కహానీలు !!!

"రేఖ ఆంటీ ఇంటికి వెళ్ళాలి, నాకు తోడు రారా , ఎలాగో ఖాళి కదా !!!"అని మా అమ్మ అంది. మాములుగా అయితే నేను అమ్మ కి తోడుగా ఆంటీ ఆంటీ ఇళ్ళకి వెళ్ళను. నాకు బహు చిరాకు. కాని, అమ్మ పిలిచింది రేఖ ఆంటీ ఇంటికి. రేఖ ఆంటీ కి ఒక కొడుకు (అంతగా అవసరం ఉన్న విషయం కాదు లెండి) , ఒక కూతురు!!!!. కూతురి పేరు స్వాతి. స్వాతి అంటే నాకు ఎంతో ప్రీతీ. మనం అందుకే అమ్మ ఎప్పుడు పిలిచినా , రేఖ ఆంటీ ఇంటికి మిస్ అవ్వకుండా వెళ్తుంటాం.
ఒకప్పుడైతే మా కాలనీ లో ఉండే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెద్ద ఇబ్బంది కాదు. కాని వాళ్ళు ఇప్పుడు ఊరి అవతల కి వెళ్లి ఇల్లు కట్టుకున్నారు. అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు వెళ్ళాలంటే, రెండు బస్సులు మారి, అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని వెళ్ళాలి. కాని చాలా రోజుల తరువాత స్వాతి ని కలుస్తున్నాను అన్న ఆనందం లో .. విషయాన్నీ పెద్దగ లక్ష్య పెట్టాలా. నేను అద్దం ముందు పడ్డాను.
అమ్మ "ఒరేయ్, నువ్వు వస్తావా నన్ను ఒక్కదానినే వెల్లమంటావా " అంది.
నేను నా అలంకారం అక్కడితో ముగించి, బస్సు స్టాప్ కి వెల్లా . అది అసలే ఎండా కాలం. ఎండలు మండి పోతున్నాయి . నేను బస్సు ఎక్కి , అలా గంట సేపు కలల్లో తెలుతున్నా. స్వాతి ని కలిసి నప్పుడు ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తూ గడిపా. ఎండా పెరిగింది. నా అసహనం కూడా . ఎంత సేపటికి, గమ్యం రాదే.

నానా యాతనా పడి , చేరుకున్నాం వాళ్ళ ఇంటికి. అమ్మ రేఖ ఆంటీ కోసం వెతుకుంటూ వాళ్ళ ఇంటి లోపలి వెళ్ళింది. బయట ఒకటే సందడి. అన్నట్టూ, రేఖ ఆంటీ కొడుక్కి ఒడుగు(ఇది కూడా అంత ఉపయోగ కరమయిన విషయం కాదు లెండి).
నేను కూడా చిన్నగా అమ్మ వెంట చంటి పిల్లోడి లాగా వెళ్ళాను. పైన చూస్తే స్వాతి . ఆహా , ఓహో , అంటూ మనసులో కుప్పి గెంతులు వేసుకున్నా. సరిగ్గా చూస్తే , స్వాతి చంకన ఎవడో బుడ్డోడు ఉన్నాడు.
గుండెలో కలుక్కు మంది. సందేహం తో ఎవడు బాబు, అని అడిగే లోపలే, మా అమ్మ స్వాతి ని పలకరించింది. క్షేమ కబుర్లు అయిన తరువాత , స్వాతి "ఆంటీ , ఈయనే మా ఆయన " అంది ఎవరో పెద్దమనిషిని చూపిస్తూ .
గుండె ఎందుకో ఒకే సారిగా బరువెక్కింది. దెబ్బకి నా నోట మాట పడిపోయింది. స్వాతి నివ్వెరపోయిన నన్ను చూసి, తనే పలకరించింది. కొద్ది సేపు ఏం మాట్లాడిందో కాని, నాకు ఏమి తెలియలా. అక్కడ నుంచి ఎంత తొందరగా వెళితే అంత మంచిదని మాత్రం అనిపించింది. మా అమ్మని కొంచం హడావుడి పెడుతుంటే " కంగారు ఏముంది రా , నీకేమయిన పనా పాటా!!" అంది. అసలే గుండె బరువు తో ఉన్నవాడిని, ఇప్పుడు చెవ్వులో కూడా ఏదో మంటగా ఉంది.
ఇల్లు చేరాక , ఓ రెండు రోజులు ఎవ్వరితో మాట్లాడలా. నన్ను, నా వాలకాన్ని చూసి, పిచ్చి తండ్రికి ఒంట్లో బాలేదేమో అని అనుకుని, మా అమ్మ లైట్ తీసుకుంది.

సంధ్య ని కలిసిన తరువాత నేను కూడా ఈ విషయం లైట్ తీసుకున్నా. తప్పదు కదా మరి!!