నేను B.Tech చదువుతున్న రోజులవి . ట్రాజీ ** , ట్రాయి కుమార్ ** మా ఇంటి దగ్గర లో నే ఉండే వారు.
ట్రాయి కుమార్ ఎంత బాగా చదివే వాడో నాకు తెలియదు కాని , దానికి రెండితలు పబ్లిసిటీ వచ్చింది వాడికి మా క్లాసులో . ఇహ అందరు వాడి నుంచి ఏవేవో చిన్న చిన్న సహాయం కోసం వెళ్తుంటారు వాడి ఇంటికి. అంత షరా మామూలే అని మీకు అనిపించ వచ్చు, కాని మన ట్రాయి కుమార్ కొంచం తేడాలెండి. వాడి నోట్సులన్ని బహు 'అయిష్టంగా' ఇచేవాడు జనాలకి. అది కూడా "ఇంటి పక్కన ఉన్న వారికే" అన్న షరతు కూడా ఉంటుంది వాడి మనసులో. (బయటకి చెప్పే వాడు కాదు లే. వెధవకి మొహమాటం ఎక్కువే). ఇంతకి ట్రాయి రోజు క్లాసులో ఏమి చేస్తుంటాడు అని అడిగితే "ఎవరైనా నోట్సు అడగడానికి వస్తారేమో అని భయపడి చస్తుంటాడు" అని తప్పితే నాకు వేరే తట్టలా . అయితే వీడికి కేవలం నోట్సు పట్లే ఇంత శ్రద్ధ (read as అతి జాగ్రత్త) అని అనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే.
ఇహ పోతే మన ట్రాజీ కొంచం కేర్ ఫ్రీ టైపు లెండి. నోట్సులు ఇచ్చే వాడి నుంచి పార్టీలు ఇచ్చే వాడి దాక అందరు వాడి మిత్రులే అని అనుకునే వాడు. వీడు కావలసినంత తెలివైన (read as జాదు) వాడె.
ట్రాయి కుమార్ ఎప్పుడు నా తోనే ఉండే వాడు. (ఆహ్ విషయం నాకు ఇంకా పొల్లు పోలేదు) . ఎవడికైనా నోట్సు అవసరం వస్తే ఎటు తిరిగి నన్ను అడిగేవారు , ట్రాయి గాడిని అడగమని. ఇదేం బాధరా బాబు అని అనుకునే ఇబ్బంది పడుతూనే నేను 2nd year కి చేరుకున్నా. అపట్లో జావా ఏదో బాగా బూం లో ఉంది అని మా curriculum లో (సులువయిన )c++ ని తీసేసి (అర్ధం అవ్వని) జావా ని పెట్టారు.
*అది ఓహ్ వర్షం పడని రాత్రి .. అంతా మామూలుగానే ఉంది అని అనుకుంటుంటే ..
ట్రాజీ మా ఇంటికి వచ్చాడు. (ఏమి అవసరం వచ్చి పడిందో అని అనుకుని ) "ఏరా ఇలా వచావ్ , పద అలా పాని పూరి తిందాం" అన్నా ..
"పద . నా దగ్గర డబ్బుల్లేవ్ " అని ఒక disclaimer పడేసాడు .. (అంటే నన్ను డబ్బులు పెట్టుకోమని వాడి ఉద్దేశం, వాడి దగ్గర లేక కాదు. వెధవకి కావలసినంత తెలివి (read as కక్కుర్తి ) ఉంది )
ట్రాజీ అస్సలు వచ్చింది ట్రాయి దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని. పానీ పూరి కూడా దారిలోనే ఉంటుంది కదా అని ట్రాజీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాడు. నా కక్కుర్తి కి తగట్టే వాడికి పానీ పూరి ఇప్పించి , ట్రాయి గాడి ఇంటికి చేరాము.
తలుపు కొట్టగానే , కేవలం తల మాత్రమే బయట పెట్టి "ఏమిటి ?" అని అన్నాడు ట్రాయి. వీడు అలా అంటాడని తెలిసే ట్రాజీ నన్ను తలుపు కొట్టమన్నాడు. మామూలుగా ట్రాయి నన్ను చూసి మిగతా శరీరాన్ని బయటపెడుతుంటాడు.
ట్రాజీ అప్పటిదాకా ప్రపంచంలో ఉన్న టైం అంతా వాడి దగ్గరే ఉంది అనేలా ఉండి , ట్రాయి ని చూడగానే ఏదో కొంపలు మునిగి పోయే పని ఉన్నట్టు .. "రేయ్ ట్రాయి , నాకు నీ .............. (wait for it) ................ జావా cd కావాలి రా " అన్నాడు కొంచం హడావుడిగా. ట్రాజీ ఇలా జనాలని తొందర పెడితే పని అవుతుందని నమ్మే వాళ్ళలో ఒకడు (తెలివి కదా మరి!)
ఆహ్ cd ఏమో dietel & deitel అనే ఒక పాడు బుక్ తో పాటు ఫ్రీ గా వచ్చి చస్తుంది.
వెంటనే ట్రాయి గాడు "నేను ఇవ్వను రా ! .. బుక్ తోపాటు ఫ్రీ గా వస్తుంది , కావాలంటే నువ్వు కూడా బుక్ కొనుక్కో" , అని ఒక ఉచిత సలహా పారేశాడు.
ట్రాజీ నావైపు నిస్సహాయంగా చూసి "ఒరేయ్ నువ్వైనా చెప్పరా " అన్నాడు
నేను ఏదో అక్కడ ఉన్న పెద్దమనిషి లాగా "రేయ్ ట్రాయి , మరీ చిన్న పిల్లోడి లాగా ఏంటి రా , ఆహ్ cd ఏదో ఇచేయి రా , రేపే ఇచ్చేస్తాడు .. పైగా మీ ఇంట్లో computer కూడా లేదు కదా .. నువ్వు దాన్ని ఎలాగో ఉపయోగించుకోలేవ్ !" అన్నా
"కావాలంటే నీది ఇవ్వు !! " అన్నాడు ట్రాయి . ఆయనే ఉంటె మంగళవాడి తో పని ఏంటి అని అనుకుని. ఇలా అయితే పని అవ్వదు అని గ్రహించి .. ట్రాయిని ఒక ఒప్పందం కి తీసుకు వద్దామని .. "పోనీ ట్రాజీ తో పాటు ఇంటికెళ్ళి జావా install అవ్వగానే cd తీసుకువచ్చేయి " అన్నా .
మన ట్రాయి ఎక్కడికో బయల్దేరడం మొదలెట్టాడు. ఇంట్లోకి వెల్లి "అమ్మ నేను ఒక అర గంట లో వస్తా " అని గట్టిగా అరిచాడు .
ఈ లోపు ట్రాజీ గాడు .. "ఒరేయ్ నువ్వేంటి రా పని ఇంకా complicated చేస్తున్నావ్ .. వాడు మా ఇంటికి వస్తే .. cd అరిగిపోతుంది అని చంపేస్తాడు రా " అని నాతో అన్నాడు ..
నేను కూడా "నిజమే .. ఈ విషయం అస్సలు ఆలోచించలా! " అని అన్నా .
ట్రాయి గాడు బయల్దేరడం చూసి కంగారు తో, కొంచం అసహనం తో ట్రాజీ గాడు విల విలలాడుతున్నాడు .
ట్రాయి అలా మా ముందుకి రాగానే "ఒరేయ్ ఒక్క cd కోసం ఇంత బ్రతిమిలాడాలిరా వీడిని. అది కూడా ఫ్రీ ఏ కదా రా .. పైగా వాడి ఇంట్లో computer కూడా లేదు .. ఇస్తే అరిగిపోతుందా" అన్నాడు నాతో వాడిని చూస్తూ.
"అంటే ఇప్పుడు మనం ట్రాజీ ఇంటికి వేల్లట్లేడా??" అని ట్రాయి నన్ను అడిగాడు .. నేను లేదు లో కేవలం 'లే 'అనే అన్నా .. ఈ లోపు ట్రాయి గాడు
"అవును రా .. నా సొమ్ము ... అరిగిపోతుంది ... నేను ఇవ్వను!!!! " అన్నాడు ట్రాజీ ని చూస్తూ .
.
..
.
.
ఇలా ఓహ్ గంట గడిసింది ..
.
ట్రాజీ బాధ చూడలేక .. ట్రాయి ఒప్పుకున్నట్టే ఇంటిలోకి వెళ్ళాడు ..
హమ్మయ ఇప్పటికైనా ఒప్పుకుని చచ్చాడు .. అని అనుకోబోయే లోపలే ..
ట్రాయి గాడు వెధవ మొహం వేసు కుని బయటకి వచ్చి ..
" ఒరేయ్ ..
.
.
.
(wait for it)
.
.
.
మా అమ్మ ఇవ్వోద్ధంది రా " అన్నాడు .. .. .
ఇది ఎదుగుదల లో లోపం అని గ్రహించి .. నేను ట్రాజీ ఇంకేమి మాట్లాడకుండా ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్లి పోయాం .
మరుసటి రోజు కాలేజి లో ఈ విషయం తెలిసి అందరం ఏకగ్రీవంగా ఒకే విషయం మీద బుర్ర బద్దలు కొట్టుకున్నాం ...
"వాడు ఆహ్ CD ని ఏం చేసుకుంటాడు ????"
** -- పేరులు తగినట్టు మార్చబడినవి
* -- గౌతం గారి బ్లాగ్ నుంచి ఎత్తేసిన లైన్ అది. copyright వారికే చెందుతుంది
kalla mundu patralu kanipistunnai...super presentaion
ReplyDeleteBabai at his best
ReplyDeletehehe..
ReplyDelete"maa amma ivvaddu antondi ra"- :))
nice one sunil..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletemee abhimanaaniki nenu dhanyudanu !!
ReplyDeleteThanks all
traji...lol! awesome post ra...malli malli chadavalani undi :p
ReplyDeleteoh thanks Karthik !
ReplyDelete