Monday, April 5, 2010

మన క్రికెట్ విన్యాసాలు

అవి నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు !! (అబ్బా మళ్ళి అదే లైనా అని మీరు అనుకుంటే .. ఎస్ మళ్ళి అదే ) .
మేము అప్పట్లో హైదరాబాద్ లో పంజాగుట్ట కాలనీ లో ఉండేవాళ్ళం. సుమారు ఇరవయి మంది దాక పిల్లల మూక ఉండేది . మాకు క్రికెట్ మీద మామకారం ఎక్కువ (దాన్ని ఆట బాగా వచ్చు అని మాత్రం పొరపాటు పడకూడదు) . నిజం చెప్పాలంటే అందరికి ఆట బానే వచ్చు , నాకు నా వీడియో గేమ్స్ మీదనే మక్కువ ఎక్కువ . బయట ఆడే స్పోర్ట్స్ ఏమయినా ఉంటె క్రికెట్ ఒక్కట్టే కావడం తో నాకు ఆడక తప్పేది కాదు. దీనికి అసలు కారణం మా నాన్న లెండి. నేనేదో ఇంట్లో హాయిగా " 64 in 1 " కాసేట్టు పెట్టుకుని " kung-fu " ఆడుకుంటూ ఉంటా. మా నాన్న నా మీద దిగులు పడి .. "అలా బయటకి వెళ్లి ఆడుకోర మిగతా పిల్లల్లాగా ".. అని అనేవాడు . నేను ఆట కి వెళ్తాను . అక్కడేమో అందరూ ఆరి తెరక పోయిన నేను సరిగ్గా ఆడకపోతే తిట్టెంత లెవెల్ కి మాత్రం ఎదిగిపోయారు. నేను బాట్ ఊపిన ప్రతి సారి ఏదో ఒకటి జరగక మానలేదు .

రోడ్డు మీద క్రికెట్ ఆడితే , సమీపం లో ఉన్న వాళ్ళ పోరు తెలిసిందే. ఇలాగే రోజు నేను అందరి పాలిట విల్లన్ లాగా , పిలవని పేరంటానికి (క్రికెట్ ఆట కి ) వెళ్ళాను. ఆట మొదలైంది, మనకి బాడ్ టైం కూడా . ఏదో అలా బాట్ ఊపాను , అందరూ సరిగా ఆడట్లేదు అని తిట్టిపోసారు . ఇంత వరకు , మనకి మామూలే. కాని రోజు ఎందుకో తెలియదు ఆవేశం తన్నుకొచ్చింది . రోజైన సరిగ్గా ఆడి చూపిస్తా అని మనసులో అనుకోని , బంతిని బలం గా కొట్టా . అది పోయి సరిగ్గా పక్కింటి వాళ్ళ ముదనష్టపు కిటికీ అద్దానికి తగిలింది . అద్దం పగిలింది. బంతి పోయింది . అందరికి బంతి పోయిందన్న బాదే . కిటికీ అంత బ్రహ్మాండంగా ఉండేది .
ఇంటి ఓనరు వచ్చి నానా రాద్ధాంతం చేశాడు . కిటికీ ఎంత ముదనష్టపుది అయిన , ఆయన దానికి ఇచ్చిన బిల్డప్పే వేరు . దాన్ని గాజుతో చేసిన వజ్ర కిరీటం లాగా , దాన్ని మేము పగలగోట్టమని , భారత్ దేశం లో " youth " క్రికెట్ ఆడి ఎలా చేడిపోతున్నారో ఓ చిన్న వ్యాసం రాసి , అక్కడికక్కడే చదివేసాడు కూడా . (మా స్కూల్ టీచర్లు అయితే విసిల్స్ వేసి మరీ చప్పట్లు కొట్టే వాళ్ళు.) మాకు ఇది రోజు ఉండేదే కాబట్టి , మాలో ఒకడు ఏమి అవ్వనట్టే , " అంకుల్ బాల్ " అన్నాడు.
" నేను చస్తే ఇవ్వను రా " అని ఆయన మండి పడ్డారు.
సరే అంతా అయిపోయాక, చిన్న పెద్ద తేడా లేకుండా, నన్ను అందరూ వీర బాదుడు బాదుకున్నారు
ఇక నుంచి నన్ను సభాముఖంగా ఆట నుంచి బహిష్కరించారు కూడా.
మంచిది. నేను పోయి నా వీడియో గేమ్ ఏవో నేను ఆడుకోవచ్చు అనుకున్నా.

అది అలానే పోయి ఉంటె ఎంతో బాగుండేది. దుర్గానగర్ కాలనీ వాళ్ళు మా కాలనీ కి వచ్చి మేము, మా పక్క కాలనీ వాళ్ళము కలిసి "tournaments" సిద్దం చేస్తున్నాం .. మీరు కూడా వస్తే , మీ ప్రతిభ ను మాకు మిగతా వారికీ చాటి చెప్పొచు అన్నారు.
ఒక " tournament "కి వెళ్లి వెళ్ళగానే ఒడి వచ్చాము మేము పిల్లలం అందరం. అందులో ( ఓటమి లో )మన హ్యాండ్ లేక పోవడం మంచిదే అయ్యింది. మనం వెళ్ళడం . అవుట్ అయ్యి పోయి రావడమే కాబట్టి అసలు ఇబ్బందే లేదు.
కాని విషయాన్నీ , పంజాగుట్ట వాసులు అందరూ పరువు సమస్య గా భావించి , దుర్గానగర్ కి సారి భారి టీం ని తాయారు చేసి పంపారు .
విధి కాబోలు , దానిలో నేను కూడా ఉంది చచ్చా. అది కీలకమయిన మ్యాచ్ . సెమి ఫైనల్ పైగా. మేము బాగానే ఆడుతున్నాం . సమీర్ అని ఒకడు మా కాలనీ లో స్టార్ ఆటగాడు. వాడు మాత్రం చెలరేగుతుంటే, మిగతా వాళ్ళు మాత్రం అవుట్ అయ్యి వచేస్తున్నారు. మళ్ళి లాస్ట్ లో నన్ను దింపుతారేమో అని నాకు ముందే డౌట్ వచేసింది, మాత్రం ఆలస్యం చెయ్యకుండా నేను ముందు గానే బాటింగ్ కి వెళ్ళడానికి నా శాయశక్తుల ప్రయత్నించాను . అందరు ఇప్పుడు మ్యాచ్ చాలా కీలకమయిన పోసిషన్ లో ఉంది , నువ్వెందుకులే ఇప్పుడు అనే వారు.
నా పప్పులు ఉడకక పోవడంతో , సయిలేంట్ అవ్వక తప్పలేదు. కాని మా బడుద్ధాయిలు అందరు అవుటయితే మనకి బట్టింగ్ రాదు మరీ !!
7 balls 3 runs "1 Wicket". అని ఎవడో అన్నాడు. మనకి బట్టింగ్ రానే వచ్చింది , అది కూడా ఊహకి అందని అంత కీలక మయిన పోసిషన్ లో . అందరూ నా వంక నిస్సహాయంగా చూసి , "ఒరేయ్ ఒక్క బంతి ఆడేయి రా , ఎదురు గా సమీర్ ఉన్నాడు , తరువాతి ఓవర్లో వాడు చూసుకుంటాడు", "ఒరేయ్ ప్లీజ్!! " అని ఎవడో ఏడుపు మొదలెట్టాడు.
నేను ఏదో సినిమా లో హీరో లాగా " అభయమిదే మిత్రమా , ఒక్క బంతిని చీల్చి చెండాడెదను "
అన్నాను.
అక్కడ ఉన్న వాళ్ళు అందరూ విసిల్స్ వెయ్యడం మానేసి, "అంత ఓవర్ చెయ్యకు రా" నుంచి , "వీడు ముంచేటట్టే ఉన్నాడు" వరకు రక రకాలుగా నాకు వినిపించేలా అంటున్నారు.
నేను మాత్రం బంతి ని ఆంగిల్ లో సిక్స్ కొట్టాలా అని ఆలోచించడం మొదలెట్టా.
వాడు బంతి వెయ్యనే వేసాడు, అది వైడు పోతూ పోతూ నా మీదకు వచ్చేసింది, వైడు కదా అని కొట్టడం సగం ఆపిన వాడిని, మీదకు వచ్చే సరికే ఏదో చిలక్కొట్టినట్టు బాటు ని బంతికి అలా తగిలించా , బంతి గాలి లో ఎగిరింది, నాకు పెద్ద గా స్పృహ లేదు.
బంతి ఎటుయినా పోయి ఉండొచ్చు అని, ఏం జరిగింది అని అటూ ఇటూ చూసా. వాడు ఎవడో "caaaaaaaaaaatchhhhhh it !!!!!!!!!!!!!!!!!!!" అని గట్టిగా అరిచాడు . అప్పుడు అర్ధం అయ్యి గాలిలో చూసా. పర్లేదు బానే కొట్టానని అర్ధమయ్యింది , బంతిని బౌండరీ లో ఎవడో క్యాచ్ పట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
వెంటనే నేను స్పృహలో కి వచ్చాను. క్యాచ్ వాడు పట్టాడు అంటే నేను చచ్చానే. బంతి తాపిగానే వాడి చేతిలోకి వచ్చి పడింది . పట్టాడు సన్నాసి.
ఇహ ఒడి పోయాము అన్న విషయాన్నీ జీర్ణించు కోలేని వాళ్ళు వెనకాలా ఉండి బాధ పడడం స్టార్ట్ చేసారు. జీర్ణం అయ్యిన వాళ్ళు చిన్న క్యు లో నిలుచుని , ఒక్కొకడు పేరు పేరున వచ్చి నన్ను చితక బాదారు.
సాయంత్రం లోపు జీర్నిచుకున్న వాళ్ళు మళ్ళి వస్తారు అని గుర్తించి , ఉపాయం కనిపెట్ట్టక పోతే , నన్ను పచ్చడి పచ్చడి గా కొట్టేస్తారు అని తెలిసి , ముందు గానే ఏడవడం మొదలెట్టా.
"సెవెంత్ క్లాస్సు వెధవ , బడుద్ధాయి , నీకి ఎడుపెంట్రా పిల్లోడి లాగా !!" అని కొందరు అన్నా కూడా ..జనాలు నా వల లో పడ్డారు. జాలి వేసి మళ్ళి తిడదాం లే అనుకుని వెళ్ళిపోయారు.
వారం పాటు నేను ఫరార్ . ఎవరికీ కనిపించలేదు. చిన్నగా అందరు విషయం మర్చిపోవడం వల్ల మన విన్యాసాలు ఇంతటి తో ఆగలేదు సుమా !!

4 comments: