Thursday, April 15, 2010

మెసేజ్ తెచ్చిన ముప్పు - part 2

మెసేజ్ తెచ్చిన ముప్పు -- Part 1

కి ఇది రెండో భాగం అని గమనించ గలరు . కధ ముందు నుంచి తెలుసుకోవాలంటే అది చదవండి .

కధ లో ని పాత్రలని ఒక సారి గమనిద్దాం :
రమణ - అసలీ మెసేజ్ idea వాడిదే.
మహేష్ - అభాగ్యుడు
ప్రసాద్ - మహేష్ మీద మెసేజ్ idea ని పెట్టమని సలహా ఇచ్చిన వాడు . కంత్రి .
బన్నీ - మహేష్ గాడికి వీడు బాగా సన్నిహితుడు
బాబు - మన కొత్త పాత్ర .

------------------------------
ఫ్లాష్ బ్యాక్
------------------------------
మహేష్, ప్రసాద్ రూం లో ఉన్నారు. కధ లో కొత్త పాత్ర "బాబు". బాబు, అంటే ఏదో చిన్న బాబు అనుకునేరు, వీడు నలుగురు పిల్లలకి బాబు లా ఉంటాడు. వీడికి కేవలం పెళ్ళికాలేదు అన్న ఒకే ఒక్క కారణానికి, భారత దేశం లో ఇంకా జనాభా లెక్కలు అదుపులో ఉన్నాయి. ఎవడో మొంగోలియా దేశం రాజు చెంఘీస్ ఖాన్ లాగా , ఆసియా అంతా వీడి నిషాని వెయ్యాలని ఆశ , వీడిది. (మీకు తెలుసో లేదో అప్పట్లో మొత్తం ఆసియా జనాబా లో , ప్రతి నలుగురి లో ఒకరు రాజు సంతానమే అట !! )

బాబు అలవాటు తప్పి , నాలుగో రోజుకే స్నానం చేసి (అసలు లెక్క వారం లెండి) ప్రసాద్ రూం కి తల తల మెరిసిపోతూ వెళ్ళాడు.
ప్రసాద్ వెలిగిపోతున్న బాబు ని చూసి కొంటె గా "నీ చర్మ సౌందర్యానికి కారణం LUX ? " అన్నాడు . బాబు ఏదో అనబోయే లోపలే మహేష్ వీర ఆవేశం తో " వీడు బోకుబిచ్చ వడతాడేమో రా " అని అన్నాడు ఏదో ఎగతాళి చేద్దామని .

బాబు , ప్రసాద్ , ఒకరి వైపు ఒకరు తెల్లబోయిన మొహాలేసుకుని చూసుకున్నారు.
షాక్ నుంచి తేరుకుంటూ ప్రసాద్ "ఏంటది .. బోకు ?? " అన్నాడు.
మహేష్ : " ఏంటి ?? నీకు బోకుబిచ్చ అంటే తెలియదా ?????"

మహేష్ బాబు వైపు చూసి , "వీడికి బోకుబిచ్చ అంటే తెలియదు అంట రా !!! " ,
దీనంగా చూస్తూ "అదేంటో నాకు తెలియదు రా !! " అన్నాడు బాబు ఏదో తప్పు చేసినట్టు !

మహేష్ : "ఏంటి ? నీకూ బోకుబిచ్చ అంటే తెలియదా ?? "

దేశం లో జనాలకి general knowledge ఇంత తక్కువగా ఉంటుందా అని నమ్మలేక పోయాడు మహేష్. ఆశ్చర్యం తో (చాదస్తం కొద్ది ) ఇంకో సారి " మీకు బోకుబిచ్చ అంటే తెలియదా ? " అన్నాడు.

(బోకుబిచ్చ అంటే ఏంటో తెలుసు కోవాలంటే , ఇంకొద్ది సేపు ఆగండి.. )

------------------------------
ప్రస్తుతం
------------------------------


రమణ ఆవేశం గా మహేష్, బన్నీల వైపు పరిగెత్తు కుంటూ వెళ్ళాడు .
మహేష్ ని చూసి "నీకు మెసేజ్ ఏమయినా వచ్చిందా ? " అని అడిగాడు ..

మహేష్ "అవును వచ్చింది .." అని తన సెల్లో ఫోన్ లోకి చూశాడు ..
"hutch" నుంచి మెసేజ్ వచ్చినట్టు ఉంది .. మహేష్ కి మెసేజ్ చూసినప్పటి నుంచే ఏదో చిరాకు గానే ఉంది.
రమణ అలవాటై పోయిన అదే డైలాగ్ ని మళ్ళి వదిలాడు. "ఒరేయ్, నేను పొరపాటున నీ నంబరు కి రీచార్జ్ చేయించాను రా .. నా డబ్బులేవో నాకు ఇచ్చేయి రా " అన్నాడు
మహేష్ కి చిరాకు ఇంకా పెరిగి "అయిన నీకు నా నంబరు తో పని ఏంట్రా, నేను ఇవ్వను పో ! " అన్నాడు, మనసులో తన కక్క్రుతి ని వెలిబుచ్చుతూ.
వీడికి కక్కుర్తే కాదు అనుమానం కూడా. వెంటనే *111# కొట్టి చూశాడు. బాలన్సు అయితే వచ్చిన సూచన లేదు.
రమణ కప్పిపుచ్చుతూ "చిన్నగా వస్తుంది లే రా ... నన్ను కరుణించు రా, నా దగ్గర ఇప్పుడు రీచార్జ్ చేసుకోడానికి కూడా డబ్బులు లేవు, ఇంటికి ఫోన్ చెయ్యాలి రా " అని నంది అవార్డు వచ్చే లాగా ఓవర్ యాక్టింగ్ చేసేసాడు.
మహేష్ కరిగి , "సరే రా , బాలన్సు రాగానే నీ డబ్బులు నీకు ఇస్తా " అన్నాడు.
బుట్టలో పడ్డాడు , అని పక్కన ఉన్న బన్నీ , రమణ లు , మనసులో చంకలు గుద్దుకున్నారు.
అసలు రమణ కి డబ్బులు అవసరం లేదు. వెంటపడి, వేదించి సరదాపాడమని , idea వేసాడు.
ఇహ , మహేష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ hutch కుక్క లా వెంటపడటం మొదలెట్టాడు కూడా.
మహేష్ వీడి బాధ వదిలించు కోవాలి అని నిశ్చయించుకున్నాడు (లేక పోతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని భయం కూడా)
వారం పాటు మహేష్ ఎవరికీ కనిపించలేదు. రోజు రమణ అలా టీ తాగడానికి వెళ్ళాడు. చూస్తే అక్కడ షాప్ వాడితో గొడవ పడుతున్నాడు, మహేష్. రమణ అక్కడున్న క్లీనరు ని విషయం అడిగి కనుక్కున్నాడు.
సంగతేమిటంటే , మహేష్ వారం పాటు అదే షాప్ లో ఉన్నాడుట. రోజు షాప్ తెరవక ముందే వెళ్లి , షాప్ కట్టేసిన తరువాత వరకు (అంటే overtime పని అన్నమాట ) రోజూ తన నెంబర్ కోసం రీచార్జ్ చేసే పుస్తకం లో వెతుకుతూ షాప్ వాడిని బహు ఇబ్బంది పెడుతున్నాడుట. ఇంతకి గొడవ దేనికి అంటే .. షాప్ వాడితో night duty చెయ్యడానికి కూడా వస్తా అంటున్నాడుట , షాప్ వాడు "బేడ బేడ * " అని కన్నడం లో ఎంత మొత్తుకున్నా కూడా !
విషయం తెలిసిన ప్రసాద్, బాబు, తదితరులు అనుకున్న ప్లాన్ భారి గా విజయవంతం అవ్వడం తో ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాని కధ కు ముగింపు ఎలా ఇవ్వాలో ఎవరికీ అర్ధం అవ్వలేదు. చూదాం లే అనుకున్నారు అందరూ.
మరుసటి రోజు, బాబు తన collection ని విస్తృతం చేసే పని లో , సిల్కు స్మిత - షకీలా పాటలు, సినిమాల CDలు, సంభోగం తో సమాధి పుస్తకం జాగ్రతగా తీసుకుని వెళ్తున్నాడు. దారిలో మహేష్ షాప్ కి "duty" కి వెళ్తూ కనిపించాడు. మన బాబు , షకీలా నడుము కంటే విశాలమయిన హృదయం ఉన్న వాడు కాబట్టి, మహేష్ మీద జాలి పడి , విషయం చెప్పేసాడు.
అసలు ప్రసాద్, రమణ లని వదిలేసి, మహేష్ కి బన్నీ మీద కోపం వచ్చింది, నేరు గా బన్నీ గాడి రూం కి వెళ్ళాడు, వాడిని చితక బాదెయ్యడానికి.
బన్నీ బయట నుంచి మహేష్ రావడం చూసి , వాడి హావభావాల్లో ఏదో తేడా ఉంది అని, బయటకి వెళ్లి మూల దాక్కొన్నాడు . మహేష్ బన్నీ రూం కి తాళం వేసి "ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు , చచ్చినట్టు నా దగ్గరకే వస్తాడు. వచ్చినా కూడా చస్తాడు !!" అని వెళ్ళిపోయాడు.
ఇది ఎక్కడి న్యాయం అనుకోని, ప్రసాదే శరణమని వాడి దగ్గరకు వెళ్ళాడు బన్నీ. ప్రసాద్ మహేష్ కి ఫోన్ చేశాడు. "బన్నీ కి ఏమి తెలియదు రా, నేను, రమణ అసలు ప్లాన్ వేసింది." అన్నాడు. "మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బన్నీ గాడు నా చేతిలో చచ్చాడే, మిత్ర ద్రోహి !! " అన్నాడు మహేష్.
వీడు ఇలా అయితే మాట వినడు , అని ప్రసాద్ తన
రూం లో నుంచి తాళం పట్టుకుని మహేష్ రూం కి వెళ్ళాడు, బన్నీ ని వెంట పెట్టుకుని. అదృష్టవశాత్తు మహేష్ రూం లో లేడు. మహేష్ రూం కి తాళం వేసేసి , వీళ్ళు ఇద్దరు శుబ్రంగా ప్రసాద్ రూం లో రెస్టు తీసుకోవడానికి వెళ్లారు. తాళం చూడగానే , మహేష్ కి విషయం అర్ధం అయ్యింది . మహేష్ కి ఓటమి తప్పలేదు. అంగీకార చిహ్నంగా ప్రసాద్ కి ఫోన్ చేసి, రూం తాళం అడిగాడు. కాని, బన్నీ తో ఇహ మాట్లాడటం మానేశాడు.
దీంతో కధ ఇలా ముగిసింది, భలే అని అందరు(మహేష్ తప్ప) అనుకుని , పేరు పేరున తోటి వాళ్ళకి ఈ విషయం చెప్పుకున్నారు, చవితి కి వినాయకుడి కధ చెప్పుకున్నట్టు.
రోజు , ఇలా ప్రసాద్ , బన్నీ , రమణలు టీ తాగడానికి వెళ్లారు. అక్కడ షాప్ వాడితో, మహేష్ మళ్ళి గొడవ పడుతూ కనిపించాడు.
మహేష్ : " నాకు బాలన్సు రావాలి , అప్పుడే నీకు డబ్బు !!"
షాప్ వాడు : " రీచార్జ్ మాడ్తిని, దుడ్డు కొడి , ప్లీజ్ !!"
మహేష్ : " నేను బాలన్సు వచ్చినంత వరకు కదిలే ప్రసక్తే లేదు. నీ దుడ్డు కూడా ఇచ్చేది అప్పుడే !! "
మెసేజ్ ని నమ్మకూడదని మహేష్ ఇలా నేర్చుకోవలసి వచ్చింది.
అసలు "బోకుబిచ్చ" అంటే .. ఊళ్లలో గేదెలకు చర్మ సౌందర్యం కోసం వాడే సబ్బు అంట. ఇంత general knowledge ఉన్న మహేష్ ని చూస్తే , " పడ్డ వాళ్ళు GK లేని వాళ్ళు కాదు " అని సమేత చెప్పుకో వచ్చండోయి !!

*బేడ -- వద్దు

2 comments:

  1. Story OK mama.. kani names gurtupettukodam konchem kastanga undi... names ekkuvaga vadinattu aniinchindi.. still.. gud 1.

    ReplyDelete
  2. oh .. thanks Election . thanks for the feedback

    ReplyDelete