Saturday, July 31, 2010

నా దేవదాసు కహానీలు - 2

అది చలి కాలం. పొద్దున్నే లేచి కాలేజి కి వెళ్ళాలంటే బద్ధకం . చిన్నగా బయల్దేరడం మొదలెట్టా.
ఇప్పటికే అమ్మాయిలు లేక ఎండిపోయిన నా జీవితం లో ఆ చలి కాలం పగుళ్ళు (పెదాలకి ) తప్పితే ఏమి తేలేదు.
బస్సు స్టాప్ కి బహు బద్ధకం గా చేరా. బస్సు కోసం ఎదురు చూసి చూసి చిరాకు మొదలయింది. అప్పుడే ఒక అందమయిన అమ్మాయి అలా ఆటో దిగి బయటకు వచ్చింది. తొలిప్రేమ లో పవన్ కళ్యాణ్ , కీర్తి రెడ్డి ని చూసినట్టు అలా చూస్తూ కాలం మర్చిపోయ.
మనసు లో ఏదో ఆనందం. ఓహ్ చిన్న భయం కూడా.

నేను ఆహ్ అమ్మాయి దగ్గరికి వెళ్లి , నీ పేరు సంధ్య కదా ?? అన్నాను .
ఆ అమ్మాయి ఆశ్చర్యం తో , నీకెలా తెలుసు అంది ?
( అందమయిన అమ్మాయి , పేరు తెలుసుకోవడం పెద్ద విషయమా ఏమిటి ? మా కాలేజి లో ఎంత మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ లో ఎంత బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఉన్నారో కూడా తెలిసే మనకి , ఇది అస్సలు లెక్కే కాదు. )
ఏదో మాటదాటేసా. నేను ఎంత సేపటినుంచో వెతుకుతున్నా బస్సు ఒక్కటి ఆగలేదు కాని, ఆ అమ్మాయి ఒక్క సారి అలా నాజూగ్గా చెయ్యి ఊపింది. ఎంతో వేగంగా వెళ్ళే బస్సు కాస్త , సడన్ బ్రేకు వేసి మరీ ఆగింది ( ఒక అందమైన అమ్మాయి చెయ్యలేనిది చాలా తక్కువ పనులు అని సంధ్య ని చూసిన తరువాతే తెలిసింది ).

ఇద్దరం బస్సు ఎక్కాం. పరిచయం బానే పెంచుకున్న , ఈ నెపంతో.
అంత బానే వెళ్తున్న టైం లో మా B.Tech 1st yr రిజల్ట్స్ వచ్చాయి. సంధ్య కనిపించి మార్కుల గురించి అడిగింది.
అనుకోని పరిస్థితుల్లో , ఏదో కర్రెక్షన్లో పొరపాటో ఏమో కాని , నేను మా కాలేజీ కి ఆ సంవత్సరం topper ని అయ్యాను. ఈ పొరపాటు మళ్ళి జరగలేదు సుమీ.
దాని తో సంధ్య వీడు మనలో ఒకడు కాదు అని ఫిక్స్ అయ్యిపోయింది. వీడితో స్నేహం ఎక్కడికి వెళ్ళదు అని డిసైడ్ అయ్యిపోయి, నన్ను పిచ్చ లైట్ తీసుకుంది.
topper అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనుకునే నాకు , దేవుడు చెప్పిన సమాధానం ఇదే ..

"కొన్ని కొన్ని సార్లు నష్టం కూడా !!!"

1 comment: