Friday, July 16, 2010

కాటాగాడి (సొల్లు) కబుర్లు - 2

సంతోషం కొద్ది !!

నేను : "మాష్టారు, నా బ్లాగు చదవండి "
మాష్టారు : " ఒక్క నిమిషం .. "
నేను : " ఒక్క నిమిషం , అయ్యిపోయింది "
"అయితే ?"
"అయితే, నా బ్లాగు చదవొచ్చు అన్నారు కదా "
"అస్సలు మీరు బ్లాగులో ఏమి చెప్పాలను కుంటున్నారు, ఎందుకు చెప్పాలను కుంటున్నారు ? "
" అదేంటి , మాష్టారు! గాలి ఎందుకు వీస్తుంది, ఆకలి ఎందుకు వేస్తుంది అంటే ఏమి చెప్పగలం ?"
--------------------------------------------------------------------------------

దాదా, నేను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దాదా ఫోన్ చేశాడు

దాదా : "ఎక్కడున్నావ్ సునీల్ "
నేను : " నేను బస్సు స్టాప్ లో ఉన్నా "
దాదా : "నేను కూడా బస్సు స్టాప్ లోనే ఉన్నా. "
నేను : " నీకు ఎదురుగ ఏమయినా ఉంటె చెప్పు, బస్సు స్టాప్ చాలా పెద్దగ ఉంది. నువ్వు నాకు కనిపించట్లా "
దాదా : "నా ఎదురు హోటల్ బ్రగంజా ఉంది . సరిగ్గా దాని ముందుకి వచ్చేయి "
నేను : "హోటల్ పంచగంగా అని ఉంది , నా ఎదురుగా .. అదేనా ??"
దాదా : "లేదు సునీల్, హోటల్ బ్రగంజా .. బ్రగంజా .. బ్ర .. గన్ .. జా !!! "
"లేదు దాదా , అది హోటల్ పంచగంగానే అయ్యి ఉంటుంది " అని నేను ఓ పక్కకి తిరిగి చూశా ..
అది హోటల్ "Braganza!!!!"
---------------------------------------------------------------------------------
కష్టాలతో జల్సా !!!

నేను : " ఏరా ఆఫీసు కి వెళ్ళడానికి ఎంత సేపు పడుతుంది ?"
ఫ్రెండ్: " అర గంట పడుతుంది రా .. "
నేను: "అంతే కదా .. "
ఫ్రెండ్ : "ఏంటి ?? అంతే కదా నా ? నీకేమి తెలుసు రా మా ఆఫీసు వెళ్ళే కష్టాలు "
నేను : " నాకు ఏమి తెలుసా ? ..
ఆఫేసు కి వెళ్ళాలంటే పోను పదిహేడు కిలోమీటర్లు , రాను పదిహేడు కిలో మీటర్లు వెళ్ళాలని నీకు తెలుసా .. నాకు తెలుసు!! ..
ఆఫేసు కి వెళ్ళాలంటే , లోకల్ ట్రైన్ ఎక్కాలని , ఎక్కాలంటే వంద మందిని తోసుకుంటూ ఎక్కాలని, దిగాలంటే వంద మందిని తోసుకుంటూ దిగాలని, నీకు తెలుసా .. నాకు తెలుసు !
కంటి నిండా నిద్ర లేకుండా , కడుపు నిండా తిండి లేకుండా , సూర్యుడిని చూడక ముందే ఆఫీసుకి వెళ్ళాలని నీకు తెలుసా .. నాకు తెలుసు !
ఈ బ్లాగు చదివాల్లెవరికి ఆఫీసుకి వెళ్ళే కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు, ఒక్క నాకు తప్ప !
ఇంటర్నెట్ నీకేప్పుడైన అమ్మ లా కనిపించిందా ? కీ బోర్డ్ మీద చెయ్యిపెడితే నీకేప్పుడైన ధైర్యం వచ్చిందా ?
నాకు అనిపించింది .. అందుకే బ్లాగర్ ని అయ్యాను !!!!
బ్లాగర్ ని అయ్యాను !!!
బ్లాగర్ ని అయ్యాను !!!!!"
---------------------------------------------------------------------------------

4 comments: